కోల్‌కతా: తక్కువ ధరలకే విమానయాన అవకాశం కల్పిస్తున్న ప్రైవేటు విమానయాన సంస్థ గో ఎయిర్ వచ్చే అక్టోబర్ నుంచి విదేశీ గమ్యాలకు సర్వీసులు నడపనుంది. ప్రారంభ దశలో ఆసియాలోని గమ్యాలకు విమాన సర్వీసులు నడపనున్నట్టు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జే వాడియా చెప్పారు. ప్రాంతీయంగా ఏయే గమ్యాలకు విమాన సర్వీసులు నడపవచ్చనే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ప్రస్తుతం 24 విమానాలున్న గో ఎయిర్.. 143 ఎయిర్‌బస్ నియో ఎ320 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. వాటిలో ఐదు మాత్రమే ఇప్పటికి అందాయి. ఇంజన్‌కి సంబంధించిన సమస్యల వల్ల కొత్త విమానాల డెలివరీ జాప్యం అవుతున్నదని వాడియా తెలిపారు. ఎయిరిండియాలో వాటాలు తీసుకోవడంపై ఆసక్తి ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పట్లో ఐపిఒకు వచ్చే యోచన కూడా లేదని తెలిపారు.

Comments
Post a Comment