Skip to main content

కూల్‌గా వచ్చేసిన ‘లవకుమార్‌’…






అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘జై లవ కుశ’ నుండి లవ కుమార్‌కు సంబంధించిన రెండు ఫస్ట్‌లుక్‌లను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ‘జై’ లుక్‌లో తన ఉగ్రరూపాన్ని చూపిన ఎన్టీఆర్‌, ‘లవ’ లుక్‌లో మాత్రం మంచి స్మైల్‌తో డీసెంట్‌గా వచ్చేశాడు. చూస్తుంటే ఈ కారెక్టర్‌లో ఎన్టీఆర్‌ ఓ ఉద్యోగిలా కనిపించనున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి జై లుక్‌తోనే ఈ మూవీపై అంచనాలను పెరిగిపోగా, ఇప్పుడు లవ లుక్‌లతో వాటిని మరింతగా పెంచేశాడు ఎన్టీఆర్‌.
ఇక ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన రాశి ఖన్నా, నివేథా థామస్‌, నందిత నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి రాక్‌స్టార్‌ సంగీతాన్ని అందిస్తుండగా, బాబి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌ 21న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

Popular posts from this blog