Skip to main content

లవకుమార్‌గా ఎన్టీఆర్ ఎలా ఉన్నాడో చూడండి!











జనతా గ్యారేజ్ సినిమా తర్వాత జైలవకుశ అంటూ ఎన్టీఆర్ మరోసారి విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తన కెరీర్‌లోనే తొలిసారిగా మూడు పాత్రలు పోషించబోతున్న చిత్రం జైలవకుశ. ఇప్పటికే ఈ సినిమాలోని జై పాత్రను పరిచయం చేస్తూ చిత్ర దర్శకుడు బాబీ ఓ టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రావణుడిగా ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌కు రెస్పాన్స్ ఏ రేంజ్‌లో వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క డైలాగ్‌తో సినిమాపై అంచనాలను ఎన్టీఆర్ మరింత పెంచేశాడు. ఇంతకు ముందెన్నడు చూడని ఎన్టీఆర్‌ను ప్రేక్షకులకు చూపించి చిత్ర దర్శకుడు బాబీ ఫ్యాన్స్‌ మనసు గెలుచుకున్నాడు. తాజాగా ఈ సినిమాలోని మరో పాత్ర లవను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ చాలా కూల్‌గా ఉన్నాడు.
జై పాత్రలోని నెగిటివ్ షేడ్‌ను కళ్లకు కట్టినట్లు చూపించిన బాబీ.. లవకుమార్ పాత్రను మాత్రం అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. లవకుమార్ పాత్రలో ఎన్టీఆర్ చాలా కూల్‌గా, ఎటువంటి హడావుడి లేకుండా కనిపించాడు. బృందావనం సినిమా తర్వాత మరోసారి లవను లవర్ బాయ్‌గా చూపించడంలో దర్శకుడు బాబీ సఫలీకృతుడయ్యాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో కల్యాణ్ రామ్ జైలవకుశను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే మరో నందమూరి హీరో బాలకృష్ణ సినిమా పైసా వసూల్ కూడా సెప్టెంబర్ 1న విడుదల కానుండం విశేషం. ఈ రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని రాబట్టగలిగితే నందమూరి అభిమానులకు పండగేనని చెప్పక తప్పదు.



Comments

Popular posts from this blog